ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి

Spread the love

ఎన్నికల నేపథ్యంలో నగదు 50,000 రూపాయలకి మాత్రమే అనుమతి..

సీజ్ అయిన నగదు జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా పొందవచ్చు : జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు

  • జిల్లా గ్రీవెన్స్ కమిటీ కార్యాలయం ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు. శుక్రవారం కలెక్టరేట్ లో ఎన్నికల నేపథ్యంలో సీజ్ అయిన నగదు విడుదల కోసంజిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ ప్లోర్ లోని G 38 రూమ్ నందు గ్రీవెన్స్ కమిటి కార్యాలయం ఎర్పాటు చేయడం జరిగింది.

ఎన్నికల ప్రవర్తన నియ మావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో రూ.50వేల లోపు నగదును మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. ఆధారాలు లేకుండా ఎక్కువ మొత్తంలో నగదు తీసుకుని వెళ్లవద్దని ప్రజలకు సూచించారు. నిబంధనలు అతిక్రమించి ఎక్కువ మొత్తం లో నగదు దొరికితే ఆ మొత్తాన్ని సీజ్ చేసి జిల్లా ట్రెజరీలో జమ చేస్తారని తెలిపారు. ఒక వేల రూ.10 లక్షలపైగా ఎక్కువ నగదు పట్టుబడి విడుదల కోసం సంబంధిత ఆదాయపు పన్ను అధికారులకు తెలియ పరిచి నగదు విడుదల కోసం నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపారు. అత్యవసరంగా తీసుకోని వెళ్లే డబ్బులకు అధికారులకు ఆధారాలుగా నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఏటీఎం చీటి, వస్తువులు, ధాన్యం విక్రయ నగదు అయితే సంబంధిత బిల్లు, భూమి విక్రయించిన సొమ్ము అయితే డాక్యు మెంట్లు, వ్యాపారం సేవల నగదు అయితే లావాదేవీలు వివరాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధారాలు లేక సీజ్
అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి కలెక్టరేట్ లోని జిల్లా గ్రీవెన్సు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేయనైనదని కలెక్టర్ తెలిపారు.

జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఇంచార్జి ZP సీ ఈ ఓ వి వి అప్పారావు, నెంబర్ :8374566222 ని
సంప్రదించాలన్నారు.

ఈ కార్యక్రమం లో ZP CEO వివి అప్పారావు,DRDO మధు సూదన్ రాజ్,ZP డిప్యూటీ CEO శిరీష,ఎఓ సుదర్శన్ రేడ్డి, శ్రీనివాస రాజు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page