SAKSHITHA NEWS

రైతులు పండించిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి -కట్కూరి అశోక్ రెడ్డి

•రైతులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోరా..?

తహసీల్దార్ కు వినతిపత్రం అందచేసిన బి జె పి నాయకులు

కమలాపూర్ సాక్షిత

భారతీయ జనతా పార్టీ కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మార్వో మారుపాక సురేష్ కుమార్ కి కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ
సందర్భంగా అధ్యక్షులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రైతుల పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన కొనేదిక్కు లేకుండా పోయింది. పలు గ్రామాల్లో ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలనే ప్రారంభించని దుస్థితి ఉంది కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను పోసుకొని రైతులు రోజుల తరబడి పంట కొనుగోలు కోసం ఎదురుచూస్తున్న దయనీయ పరిస్థితి ఉంది ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలన్నీ వడ్ల కుప్పలతో నిండిపోయి, స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు వాతావరణ పరిస్థితులు, పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు పంట కాపాడుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

రైతులకు గొనె సంచులు తర్పాలిన్లు కనీసం అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో చేస్తున్న ప్రకటనకు ఆచరణకు పొంతన లేకుండా పోయింది, రైతుల పంట కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు , కొర్రీలు పెట్టకుండా పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేయాలని అన్నారు పంట కొనుగోళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని, వడ్ల కొనుగోళ్ల ను తక్షణం ప్రారంభించాలని , అలాగే అన్ని రకాల సన్న వడ్లకు మద్దతు ధర చెల్లించి , కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రూపాయలు 500 బోనస్ సన్నవడ్లతో పాటుగా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కమలాపూర్ మండల కిసాన్మోర్చా అధ్యక్షులు పెండ్యాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మ శోభన్ బాబు, హనంకొండ జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి బూర కుమారస్వామి, హనంకొండ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మౌటం రమేష్ బాబు, సీనియర్ నాయకులు మోకడె ప్రసాద్, గొంది ఆదిరెడ్డి, మోటం శ్రీనివాస్, కుమారస్వామి,రమేష్, కుమారస్వామి, సదానందం, కొండ కుమార్, గోల్కొండ మొగిలి, జంగిలి సాంబయ్య, నరిగే ఓదెలు, నిగ్గుల శంకర్, కొత్తకొండ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS