శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆయా డివిజన్ల లో నెలకొన్న పలు సమస్యలు మరియు వాటి పరిష్కారానికై తీసుకోవాల్సిన చర్యల పై చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయం లో జరిగిన సమీక్షా సమావేశంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్ , జగదీశ్వర్ గౌడ్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్లు శ్రీ సాయి బాబా , మాధవరం రంగరావు తో కలిసి ఆత్మీయ సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అకాల వర్షాల ద్వారా కాలనీ లలో జరిగిన పరిణామాల ను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజులలో ఇలాంటివి జరుగకుండా కాలనీలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని,ముఫు ప్రాంతాలను గుర్తించి,ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలను చేపట్టాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అకాల వర్షాలకు ఏర్పడిన ఇబ్బందుల ను అధికారుల సహాయం తో తొలగించాలని,ప్రజలకు మనో ధైర్యం కలిపిస్తూ ముందుకు వెళ్లాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, ఆయా డివిజన్ల పరిధిలో గల పలు సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడలని, అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని , ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారి వినతులను పరిగణలోకి తీసుకోని సత్వర పరిష్కారం అయ్యేలా చూడలని, ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూడలని, అభివృద్ధి పనులలో వేగం పెంచాలని ,ఎక్కడ రాజీ పడకూడదని సమస్యలను దశల వారిగా పరిష్కారం చేస్తూ అభివృద్ధి చేసుకోవాలని, ఆయా డివిజన్ల లో జరుగుతున్న అభివృద్ధి పనుల పై సమీక్షా చేయడం జరిగినది అని, కాలనీ లలో జరుగుతున్న పనుల పురోగతి పై మరియు కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని డివిజన్ల లో అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, పార్టీ అభివృద్ధి కోసం త్వరలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఉంటుంది అని,డివిజన్ల వారిగా మరియు నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు ఉంటాయి అని, వాటికి ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలకు, కార్యకర్తలకు అనుసంధానం గా ఉండలని , సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయుటలో ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదిల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.