విద్యార్థుల విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసానికి ఎన్టిపీసి అండ…

Sakshitha news

విద్యార్థుల విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసానికి ఎన్టిపీసి అండ….

సాక్షిత పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, రామగుండం// : విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఎన్‌టీపీసీ రామగుండం–తెలంగాణ కొనసాగిస్తోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతినగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 40 డ్యూయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. దీంతో విద్యార్థులకు మరింత సౌకర్యవంతమైన, అనుకూలమైన విద్యా వాతావరణం అందుబాటులోకి రానుంది.

అలాగే బాలికల్లో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో మూడు నెలల యోగా, స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీమతి రాఖీ సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

శిక్షణలో చురుకుగా పాల్గొనేందుకు 8, 9వ తరగతుల బాలికలకు యోగా మ్యాట్లు, టీ-షర్టులు, ట్రాక్ ప్యాంట్లను పంపిణీ చేశారు.

విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసాన్ని అందించేందుకు ఎన్‌టీపీసీ చేపడుతున్న ఈ కార్యక్రమాలు ప్రశంసనీయమని నిర్వాహకులు తెలిపారు.

Scroll to Top