పోలీస్ సేవలు సమర్థవంతంగా అందించాలి… జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్.

Sakshitha news

పోలీస్ సేవలు సమర్థవంతంగా అందించాలి… జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్……


సాక్షిత : సూర్యాపేట జిల్లా / కోదాడ
జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల తనిఖీల్లో భాగంగా కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి తో కలిసి శుక్రవారం సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం తనిఖీ చేశారు. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి సామర్థ్యంతో పని చేసి బాధితులకు, పౌరులకు పోలీసు సేవలు అందించాలని అన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న కోదాడ రూరల్, అనంతగిరి, చిలుకూరు, చింతలపాలెం, మెళ్లచెరువు పోలీస్ స్టేషన్ లకు సంభందించిన కేసుల నమోదు, దర్యాప్తు పరిశీలించారు. అయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల చరిత్ర రికార్డ్స్ ను, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ రికార్డ్స్ తనిఖీ చేశారు, సర్కిల్ పరిధిలో ఉన్న స్టేషన్ ల పనితీరు, సిబ్బంది పనితీరు బాగా ఉన్నది అని అభినందించారు, కేసులు, పిర్యాదులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలని అన్నారు.

అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి నేరాలను నివారించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో చాలా విద్యాసంస్థలు ఉన్నాయి విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, వ్యసనాలకు లోనూ కాకుండా పోలీసు ప్రజా భరోసా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాము. అంతరాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్నందున నిఘా అప్రమత్తం చేశాను చెక్ పోస్ట్ ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్నారు, అలాగే ప్రతి రోజూ స్టేషన్ ల పరిధిలో ఉన్న అన్ని ప్రధాన మార్గాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ చర్యలు తీసుకున్నాం అన్నారు. అక్రమ రవాణా జరగకుండా నిఘా విభాగాన్ని, సమాచార వనరులను అభివృద్ధి చేశామని తెలిపారు. దొంగతనాల నివారణకోసం ఎక్కువ మొత్తంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాము, సీసీటీవీ కెమెరాలను జిల్లా కేంద్రానికి అనుసందానం చేశాం అన్నారు.
ఈ కార్యక్రమంలో కోదాడ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ సర్కిల్ ఇంచార్జీ సిఐ మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, ఎస్ఐ లు నవీన్ కుమార్, యాకూబ్, అంజి రెడ్డి, డిసిఆర్బి సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబెడ్, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Scroll to Top