సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Sakshitha news

సూర్యాపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

సన్నరకం ధాన్యానికి అదనంగా క్వింటాలుకు రూ 500 బోనస్‌

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట మండలంలోని కాసరబాద గ్రామంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐకెపి లను ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు,గన్ని బ్యాగులు కొరత లేకుండా చూడాలి అని సెంటర్ నిర్వాహకులకు ఆదేశించారు.ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం తక్కువగా ఉండేవిధంగా తూర్పారబెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. గ్రేడ్‌-ఏ ధాన్యానికి రూ. 2389, సాధారణ రకం ధాన్యానికి రూ.2369 మద్దతు ధర పొందాలన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలి అని తెలిపారు.రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకే విక్రయించాలన్నారు.
రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వ్యవసాయ అధికారుల వద్ద ఉన్న వరి కోతల వివరాల ఆధారంగా రైతుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి,ఏపీఎం
మైసయ్య,సీసీ యాదగిరి, విజయభాను, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ పొలాగని సైదులు, సంకరమద్ది వెంకట్ రెడ్డి, సరిత, వసంత,యల్లమ్మ, షార్ధ, నాగమ్మ,పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ళ రమేష్, దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ళ కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్, పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, తదితరులు పాల్గొన్నారు