లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో శాంతి సమన్వయ సమావేశం…

Sakshitha news

లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో శాంతి సమన్వయ సమావేశం…

సామరస్య వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలి…

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి…

: సీఐ రమణమూర్తి

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:లక్షెట్టిపేట,
బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా పరస్పర సహకారం, సామరస్య భావనతో వ్యవహరించాలని సూచించారు.

బక్రీద్ పండుగ నేపథ్యంలో గురువారం ఉదయం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో, సీఐ రమణమూర్తి హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ రమణమూర్తి మాట్లాడుతూ, పండుగ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

ప్రజలందరూ పరస్పర గౌరవ భావంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని తెలిపారు. మత పెద్దలు కూడా పోలీసుల సూచనలను పాటిస్తూ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో స్థానిక మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top