వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వైభవంగా అమ్మవారి అలంకరణ
మద్దిరాల మండలం, సాక్షిత న్యూస్
శ్రావణ శుక్రవారం సందర్భంగా మద్దిరాల మండలం చందుపట్ల గ్రామంలోని శివరామ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముడుంబై రఘువరన్ ఆచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. అనంతరం మహిళా భక్తులు సామూహికంగా కుంకుమార్చన చేసి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. రూ.1,73,216 విలువైన అలంకరణలతో అమ్మవారిని ధనలక్ష్మి స్వరూపంలో అత్యంత వైభవంగా అలంకరించి మంగళహారతులు, మంగళ నీరాజనాలు సమర్పించారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మీదేవిని దర్శించుకుని పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. భక్తుల భక్తిగీతాలు, మంగళహారతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
