SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 21 at 4.11.31 PM

రెండో దశ ఐటీ హబ్ ను కూడా అభివృద్ధి చేస్తాం
జాబ్ మేళాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత


సాక్షిత : నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ స్థానిక యువత ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
జిల్లా లో ఐటి హబ్ ఏర్పాటు గొప్ప విషయని, విదేశీ కంపెనీలు రావటానికి సహకరించిన ఎమ్మెల్యే మహేష్ బిగాల కు ధన్యవాదలు తెలిపారు. ఒకపుడు ఐటి ఉద్యోగాలు అంటే కేవలం బెంగళూర్ ,హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితం అయ్యేవని, గ్రామీణ స్థాయిలో ఐటి విద్య అభ్యసించినవారి కోసం ఐటిఉద్యోగాలు అందించే లక్షం తో ఈ ఐటి హబ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు చిన్న పరిశ్రమలు స్వంతగా ఏర్పాటు చేయుటకు ఐటి హబ్ ఉపయోగ పడుతుందని చెప్పారు.

ఐటి హబ్ లో ఒక చైర్ కు నెలకు రూ. 3500 చెల్లించి అవకాశాలు కల్పిస్తున్నామని, 50 వేల చదరపు అడుగులు, రూ. 40 కోట్ల పెట్టుబడితో ఐటి హబ్ ఏర్పాటు చేశామని తెలియజేశారు.ఐటి హబ్ అంటే కేవలం ఉద్యోగమే కాదు ఉద్యోగాలు సృష్టించేందుకు దోహద పడుతుందని,
యువత తమ స్కిల్స్ తో ఐటి హబ్ స్పేస్ ను వాడు కావాలని పిలుపునిచ్చారు.

ఫస్ట్ ఇంటర్వ్యూ లో జాబ్ రాకుంటే నిరుత్సాహ పడొద్దనీ సూచించారు. 745 సీట్లు ఉన్నాయి.. రెండవ సారి ప్రయత్నం చేయాలని, 745 సీట్ల తో పాటు టాస్క్ అధ్వర్యంలో లో 1000 మంది కి ఐటి లో ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తామని,మొత్తం నిజామాబాద్ లో సాఫ్టు వేర్ అభివృద్ధి కి ఐటి హబ్ ఇక కేంద్ర బిందువు అవుతదని వివరించారు.

ఇది మొదటి దశ .త్వరలో రెండవ దశ ఐటి హబ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ ,ఆటో పార్క్ అభివృద్ధి కి కృషి చేస్తున్నామన్నారు. యువత రాజకీయ ల సంగతి కంటే ముందు ఉద్యోగాల పై దృష్టి పెట్టాలని సూచన చేశారు. నిజామాబాద్ ఐటి హబ్ నంబర్ వన్ గా నిలుస్తుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా జెడ్పీ ఛైర్మెన్ విఠల్ రావు.బి అర్ ఎస్ ఎన్నారై సెల్ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేష్ గుప్తా పాల్గొన్నారు.


SAKSHITHA NEWS