జూబ్లీహిల్స్ : కేబీఆర్ ఉద్యానవనంలో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు ఒకటి బయటపడింది. ఉద్యానంలో నడకకు వచ్చే పలువురు అటుగా సాగుతున్న క్రమంలో దీనిని గుర్తించారు. సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. నిజాం తన కార్లు, ట్రక్కులు ఇతర మోటారు యంత్రాలలో ఇంధనం నింపేందుకు దీనిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. రాజు అల్లూరి అనే వ్యక్తి ఈ పెట్రోల్ పంపు చిత్రాలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు వేసవి కావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. గత సంపదకు ఇదే సాక్ష్యం అంటూ రాజు అల్లూరి తన ఖాతాలో పేర్కొన్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లోనూ కనిపించడంతో ఇప్పుడు ఇక్కడి పెట్రోల్ పంపును చూడటానికి నడకదారులు ఆసక్తి చూపుతున్నారు.
నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…