మాదాపూర్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాత్రి హైదరాబాద్‌లో శిల్పారామంలోని నైట్‌బజార్‌ను పరిశీలించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు నైట్‌బజార్‌లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న 119 స్టాళ్లను ఇందుకోసం సిద్ధం చేయాలన్నారు. మహిళలకు మాత్రమే వీటిని కేటాయించాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో ఉత్తర్వులను సిద్ధం చేయాలని అధికారులతో చెప్పారు. అవసరమైతే మణిపుర్‌లో మహిళలకు కేటాయించిన మార్కెట్‌ను అధ్యయనం చేయాలని సూచించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు….
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP