SAKSHITHA NEWS

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం చెరువు ముందు తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనం, ఎల్లమ్మ గుడి నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.అలాగే గ్రామంలో మరిన్ని సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి కి తండా వాసులు సంప్రదాయ బద్ధంగా ఘనంగా స్వాగతం పలికారు.డప్పు వాయిద్యాలు, నృత్యాలు, కోలాటాలతో మంత్రి ని తమ తండాకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి తండా వాసులతో కలిసి కోలాటం అడారు, నృత్యం చేశారుపూలు చల్లుతూ మేళ తాళాలతో మంత్రిని స్వాగతించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చెరువు ముందు తండా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ఇప్పటి వరకు చెరువు ముందు తండాలో కోటి రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇంకా మరో కోటి రూపాయల నిధులను మంజూరు చేస్తున్నట్లు తండా వాసుల చప్పట్ల మధ్య ప్రకటించారు.గతంలో గిరిజనులు మా తండాలు, గూడాల్లో మా రాజ్యం అని ఉద్యమించిన తండాలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు.నిధులు ఎన్ని వచ్చినా, గ్రామాలకు పెట్టుకునే వారుకెసిఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 3,146 తండాలు, గూడాల ను గ్రామ పంచాయతీలు గా మార్చారుఆ విధంగా 3,146 మంది గిరిజనులు సర్పంచులు అయ్యారువాళ్ళ తండాల్లో వాళ్ళ రాజ్యం చేసుకుంటున్నారు

ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి నెలా కనీసం 5లక్షల నిధులు అందుతున్నాయి. ఇవ్వాళ చిన్న చిన్న గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి చెందుతున్నాయిఅలాగే, సీఎం కెసీఆర్ దయ వల్ల అనేక పథకాలు అమలు అవుతున్నాయి.దీంతో ప్రజలు మంచిగా జీవించే అవకాశం వచ్చింది. గ్రామాలను అభివృద్ధి చేసుకునే వీలు కలిగిందిఅనేక పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరిచాయిఇక…
గ్రామ దేవత తండా ప్రజలందరినీ చల్లగా చూడాలి.ప్రజలు BRS నేతృత్వంలోని సీఎం కెసిఆర్ అధ్వర్యంలో నడుస్తున్న పాలనలో సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాల తో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, తండా వాసులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS