SAKSHITHA NEWS

సైబరాబాద్ కమిషనరెట్ పరిదిలో అల్లపుర్ లో నూతన పోలీస్ స్టేషన్ ను  సిపి స్టీఫెన్ రవీంద్ర,ఎమ్మెల్యే మాధవరంకృష్ణారావు,ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ప్రారంభించారు….

ఈ కార్యక్రమంలో బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు , స్థానిక కార్పొరేటర్ సభిహా గౌసుద్దిన్, కార్పొరేటర్లు సతీష్ గౌడ్, ఆవుల రవీందర్ రెడ్డి, నర్సింహ యాదవ్, శీరిష బాబురావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు పాల్గొన్నారు…

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ అల్లాపూర్ డివిజన్ ను పూర్తిస్థాయి ఆదర్శ డివిజన్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ఒకప్పుడు ఈ ప్రాంతం ఏ విధంగా ఉండేదో నేడు అద్దాలు లాంటి సిసి రోడ్లు, పార్కులు ఇండోర్ మరియు షటిల్ కోర్టుల నిర్మాణంతో డివిజన్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు..

అలాగే శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడకుండా ఉన్నామని.. యువత గంజాయి మత్తులో తేలకుండా ఉండేందుకు అనుక్షణం పోలీసులు ఇక్కడ పనిచేస్తారని ఇక వారి ఆటలు సాగమని అన్నారు …అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేటట్టు చూడాలని సూచించారు…


SAKSHITHA NEWS