నూతన అత్యాధునిక యాక్టివా 2023 ను విడుదల చేసిన హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా
అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన హోండా స్మార్ట్ కీ ని మొట్టమొదటి సారిగా భారతదేశంలో పరిచయం చేశారు
హైదరాబాద్, ఫిబ్రవరి 2023 : భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ, స్కూటర్ విభాగంలో ఎదురులేని నాయకునిగా వెలుగొందుతున్న హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) స్మార్టర్ మరియు అత్యాధునిక యాక్టివా 2023ను విడుదల చేసింది. ఇది హెచ్‌ఎంఎస్‌ఐ యొక్క మొట్టమొదటి ఓడీబీ2 ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనం. ఏప్రిల్ 2023 గడువుతేదీ కంటే ముందుగానే దీనిని విడుదల చేసింది.
హైదరాబాద్‌లో ఫిబ్రవరి17వ తేదీన జరిగిన నూతనయాక్టివా (స్కూటర్ అంటే యాక్టివా– హెచ్ స్మార్ట్‌టెక్నాలజీతో) విడుదల కార్యక్రమంలో తెలంగాణా జోనల్ మేనేజర్ ఇస్మాయిల్ ఖాన్ ; హైదరాబాద్ ఏరియా మేనేజర్ సునీల్ రెడ్డి ; హైదరాబాద్ ఏరియా మేనేజర్ పునీత్‌కుమార్ సీ ఎస్‌తో పాటుగా హైదరాబాద్‌లోని హోండా డీలర్లు పాల్గొన్నారు.
సాంకేతికత పరంగా ముందుండే, హెచ్‌ఎంఎస్‌ఐ తమ వినియోగదారులకు సౌకర్యం మరియు సౌలభ్యాన్ని వారి రోజువారీ జీవితాలలో అందిస్తుంది. ద్విచక్ర వాహన విభాగంలో మొట్టమొదటిసాకిగా మరోమారు వినూత్నమైన ఫీచర్ – హోండా స్మార్ట్ కీ ని నూతనయాక్టివాలో విడుదల చేసింది.
నూతనంగా విడుదల చేసిన యాక్టివా 17 ఫిబ్రవరి 2023 నుంచి అన్ని హోండా టచ్‌పాయింట్ల వద్ద వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇండల్జెన్స్ ఈవెంట్స్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ మీడియా ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించరు