Nereda Shiva Temple Mustabu on the occasion of Mahashivratri
మహాశివరాత్రి సందర్భంగా నేరేడ శివాలయం ముస్తాబు
ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడ గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రఖ్యాతిగాంచిన అతి పురాతన శివాలయాన్ని గ్రామ పెద్దలు అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. నేరేడ గ్రామంలో మహా శివరాత్రి పర్వదినము ఈ నెల 18 నుంచి 20 వరకు గ్రామంలో జరుగు శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి కళ్యాణం ఈ నెల 18 రాత్రి 8 గంటలకు జరుగునని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.
ఇంటి కల్యాణానికి చింతకాని మండలంలోని అన్ని గ్రామాల భక్తులు పాల్గొని ఉన్నారు. దాదాపు 50 సంవత్సరాల నుండి పాల్గొంటారు అని నేరేడ గ్రామ శివాలయం కమిటీ ఒక ప్రకటనలో తెలియజేశారు. వారికి ఎలాంటి ఆసౌకర్యాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నున్న తాజుద్దీన్, ఆలస్యం నరసింహారావు, ఆలస్యం నాగేశ్వరరావు, మంకెన రమేష్, చింతనిప్పు వెంకటయ్య, కిలారి బాబు, అలష్యం ప్రసాద్, నున్న గోవిందరావు, కిలారి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.