అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం

అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం

SAKSHITHA NEWS

Neglect in the construction of Andevelli Peddavagu Bridge

అందెవెల్లి పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం – రెండు మండలాలకు తెగిపోయిన రవాణా సౌకర్యం…. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంధవెల్లి గ్రమంలోనీ పెద్దవగు బిడ్జీ తాత్కాలిక అప్రోచ్ రోడ్ కూలిపోవడంతో సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నిరవధిక నిరాహార దీక్ష
నిర్వహించారు వీరికి మద్దత్తు పలికిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్
అనంతరం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ
కాగజ్ నగర్ మండలం అందవెల్లి వద్ద పెద్దవాగు బ్రిడ్జి ఇసుక అక్రమ తవ్వకాల వలన గతంలోనే కూలిపోయింది. బ్రిడ్జి పుననిర్మాణాన్ని ప్రారంభించి ఏడాది దాటినా అప్రోచ్ రోడ్డు పని పూర్తి కాలేదు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంచార్జి మంత్రిగా పని చేస్తున్న శ్రీమతి సీతక్క కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకుని ఈ బ్రిడ్జి పరిశీలనకు రావడం జరిగింది. యుద్ద ప్రాతిపదికన వర్షాలు పడేలోపు ఈ బ్రిడ్జి పుననిర్మాణాన్ని పూర్తి చేసి రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని పత్రికా ముఖంగా హామీ ఇవ్వడం జరిగింది.అయితే వారు వాస్తవాలు తద్విరుద్ధంగా ఉన్నాయి. సదరు కాంట్రాక్టర్కు బిల్లులు సకాలంలో చెల్లించక పోవడంతో అతను అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టలేదు. దీనితో తొలకరి వర్షాలకే నదీ గర్భంలో ఉన్న తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో దహేగాం మరియు భీమిని మండలాల 50 గ్రామాల ప్రజలకు కాగజ్ నగర్ పట్టణంతో రవాణా అనుసంధానం తెగిపోయింది.
MLA పాల్వాయి హరీష్ బాబు శ్రీమతి సీతక్క కి రాబోయే ఉపద్రవాన్ని ముందే ఊహించి దాదాపు పది సార్లు ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయినా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ బ్రిడ్జి పునర్నిర్మాణంలో మిగిలిన పనులు తక్షణం పూర్తి చేసి ఈ రెండు మండలాల ప్రజలకు రవాణా సౌకర్యం పునరుద్ధరించాలని డిమాండ్ డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 06 24 at 13.48.35

SAKSHITHA NEWS