SAKSHITHA NEWS

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం – వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి
సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రస్తుత యాంత్రిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం శనివారం తిరుపతి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఛైర్మన్ ఆధ్వర్యంలో డి.ఆర్.ఓ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే లాభాల గురించి పలు సూచనలు, సలహాలు చేశారు. డిఆర్ఓ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం వలన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చుననని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాలతో పాటు మన దేశంలో కూడా ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అలాగే ఈ – క్రాప్ బుకింగ్ జాగ్రత్తగా చేయాలని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి దొరసాని మాట్లాడుతూ గత నెల జరిగిన సలహా మండలి సమావేశంలో సలహా మండలి సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందనీ తెలిపారు. సలహా మండలి సభ్యులు
గంగాధర్ మాట్లాడుతూ రైతులను వినియోగదారులతో అనుసంధానం వలన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవచ్చునని తెలిపారు. జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీనివాస నాయక్ మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో ఆక్వా చెరువుల వలన త్రాగు నీరు కలుషితం అవుతున్న సమస్య పరిష్కారం గురించి వివరించారు. ఎల్.డి.ఎం శుబాష్ మాట్లాడుతూ సిసిఆర్సి కార్డు కలిగిన వారికి లోన్లు ఇవ్వడానికి తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
వ్యవసాయ శాస్త్రవేత్త సునీత మాట్లాడుతూ టి.ఏ.జి 24 కు ప్రత్యామ్నాయం గా వంగడాల రకాలను గురించి వివరించారు. ఇరిగేషన్ ఎస్ఈ రాజరాజేశ్వరి మాట్లాడుతూ కండలేరు రిజర్వాయర్ లో తగినంత నీరు ఉందని తెలిపారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామి రెడ్డి ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు. పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వరులు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను వివరించారు. జిల్లా సెరి కల్చర్ అధికారి ణి గీతావాణి మాట్లాడుతూ జిల్లాలో అమలు చేసిన పథకాల గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ఎ ఎ బి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS