కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఉత్సవాలు

Spread the love

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఉత్సవాలు

సాక్షిత దినపత్రిక. హనుమకొండ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో శాయంపేట మండల కేంద్రంలో 76వ భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శాయంపేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వతంత్ర వేడుక ప్రత్యేకమైనది అన్నారు. ఆనాడు దేశ స్వాతంత్రం కోసం సమరయోధులు ఏ విధంగా ఐక్యమత్యంతో పోరాడారో అదే తరహాలో దేశ ప్రగతి కోసం మనమంతా ఏకం కావాలన్నారు
ప్రతి ఇంటింటా జాతీయ జెండాను సగర్వంగా ఎగరవేయాలి అన్నారుభారత దేశ స్వతంత్ర స్ఫూర్తిని చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు చింతల భాస్కర్ మామిడిపల్లి సాంబయ్య చిందం రవి నిమ్మల రమేష్ కృష్ణమూర్తి మార్కండేయ రఫీ రవిపాల్ మారేపల్లి రవీందర్ నరేష్ రెడ్డి రాజేందర్ కట్టయ్య సుధాకర్ కొమ్ముల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page