SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

ఏం సాధించారని ఈ సంబరాలు:నరేంద్ర వర్మ

బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని జిల్లా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంబరాలు చేస్తున్న బాపట్ల ఎమ్మెల్యే తీరును ప్రశ్నించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ .

నరేంద్ర వర్మ కామెంట్స్..

బాపట్ల జిల్లా ఆవిర్భావం జరిగి సంవత్సరం పూర్తయ్యిందని స్థానిక ఎమ్మెల్యే సంబరాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంబరాలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ?
దోమలు నివారించారా ? మరుగు కాలువలు బాగుపడ్డాయా ? పారిశుధ్యం మెరుగుపడిరదా? వీధి దీపాలు వెలగకపోతే నెలలు తరబడి వెయ్యలేని దుస్థితిలో ఉన్నారు.

ప్రజల ముక్కుపిండి పురపాలకశాఖవారు వసూళ్లు చేస్తున్న కోట్ల రూపాయలు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించకుండా ఎమ్మెల్యే సొంత ప్రచారాలకు వినియోగించడం దారుణం
సంబరాలకు ఏ నిధులు ఖర్చుచేస్తున్నారో ప్రజలకు తెలియజేయాలి.

ఏడాది పూర్తయినా ఇంకా ప్రయివేటు భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగిస్తున్నారు ?
బాపట్ల జిల్లా అయిన ఏడాది కాలంలో బాపట్ల లో మౌళిక వసతులకు ఎంతమేర నిధులు ఖర్చుపెట్టారు.

బాపట్ల ప్రజలు జిల్లా వచ్చింది… ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపడతాయని ప్రజలు ఆశించారు. కానీ, పేదలకు కనీసం వైద్యం కూడా అందించలేని దుస్థితిలో ఉన్నారు.

550కోట్లతో మెడికల్‌ కళాశాల తీసుకొచ్చానని సన్మానాలు చేయించుకున్నావు… ముఖ్యమంత్రి శంఖుస్థాపనచేసి 2 సంవత్సరాలు పూర్తయ్యింది… కనీసం పునాదైనా లేపారా ?

పంచాయితీలు, వార్డుల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి ?
ఈ సంవత్సరంలో మీరు ఏం పురోగతి సాధించారో శ్వేతపత్రం విడుదల చేయగలరా ?

పట్టణంలో నిర్మిస్తున్న రహదారిలో నిర్మాణంలో భారీగా అక్రమాలు… అష్టవంకరలు తిరిగిన రోడ్డు, మురుగు కాలువ…దీనికి బాధ్యులెవరు ?
బాపట్ల జిల్లాకు కేటాయించిన నిధులు ఏంటి ?

ముఖ్యమంత్రి బాపట్లకు వచ్చినప్పుడు 10కోట్లు అంతర్గత రోడ్ల నిర్మాణానికి, 18 కోట్లు మంచినీటి చెరువు విస్తీర్ణానికి ఇస్తానని ప్రకటించారు. వాటిలో ఒక్క రూపాయి అయిన విడుదల చేశారా ?
ఇప్పటికైనా సంబరాల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం మానేసి బాపట్లను అభివృద్ధి చేయండి.


SAKSHITHA NEWS