వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ ని పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ,స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు *
: సాక్షిత : వినుకొండ పట్టణంలో గత కొద్ది రోజుల క్రితం టిడిపి గుండాలు చేసిన దాడి లో గాయపడిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పట్టణ అధ్యక్షుడు పిఎస్. ఖాన్ ని వారి నివాస గృహం లో పరామర్శించిన నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి , వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికలు దగ్గెర పడుతున్న సమయంలో బెరిపు రాజకీయాలు చేయాలని, పట్టణం లో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఖాన్ పాల్గొంటున్నారు అనే నెపం తో ఉద్దేశిత పూర్వకంగా వారి పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాడు బస్టాండ్ దగ్గర గొడవలో కూడా ఎమ్మెల్యే కారు పై రాళ్లు రువ్వి, గందరగోళం సృష్టించి, ఎమ్మెల్యే పై హత్యాయత్నం చేయబోయారని గుర్తుచేశారు. మీ బెదరింపు రాజకీయాలకు బయపడే వాడు ఇక్కడ ఎవరూ లేరన్న విషయం తెలుకోవాలని, కార్యకర్తలకు అండగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్టీ ఎప్పుడూ ఉంటుందని, ఇక్కడి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు కూడా కార్యకర్తల విషయం లో ఎక్కడా తగ్గే మనిషి కాదని అన్నారు…