SAKSHITHA NEWS

పులివర్తి సుధా రెడ్డి …

చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం సి కె పల్లి పంచాయతీలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సామాజిక సేవలు అందిస్తూ, వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతున్న నందమూరి తారక రామారావు కూతురు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, మహిళలకు ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీమతి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలను పులివర్తి సుధా రెడ్డి కార్యకర్తలతో ఘనంగా జరుపుకున్నారు.

తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి . పలు పంచాయితీలలో బూత్ ఇంఛార్జిలు, సెక్షన్ ఇంఛార్జిలతో టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పులివర్తి సుధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు పంచాయతీల పర్యటనలో భాగంగా సి.కే పల్లి గ్రామానికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి జన్మదిన సందర్భంగా మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సి.కే పల్లి గ్రామంలో భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివర్తి సుధా రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.


SAKSHITHA NEWS