ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామ పర్యటన

Spread the love

Nama tour of the joint Khammam district

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామ పర్యటన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

బీఆర్ఎన్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఈనెల 10వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక నాయకులతో కలసి విస్తృతంగా పర్యటిస్తారని ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఖమ్మం, వైరా, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పర్యటించి, పలు శుభ కార్యక్రమాలకు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఇదే సందర్భంగా పలు కుటుంబాలను కూడా నామ పరామర్శిస్తారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని నామ కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page