హనుమకొండ 49వ డివిజన్ సుబేదారి వాటర్ టాంక్ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లడుతూ… అర్హులకు ప్రభుత్వ పథకాలు చేకూర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమం అమలు చేస్తున్నామని, ఈ కార్యక్రమాలు కూడా పార్టీలకు అతీతంగా అమలు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వస్తుందని అన్నారు, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది ఖచ్చితంగా చేస్తది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరు గ్యారంటీ స్కీం లను అమలు చేస్తాదని మాట ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాకా తోలి సంతకం ఆరు గ్యారంటి స్కీం లపై తోలి సంతకం చేసారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులకే మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించింది. రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ ని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని కావున ప్రజలు ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగంచేసుకోవాలని అన్నారు.