డిగ్రీ కళాశాలలో బిసి స్టడీ సర్కిల్ ప్రారంభించిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు

Spread the love

Nagar Kurnool MP Ramulu started BC study circle in degree college

నాగర్ కర్నూల్ పట్టణం లో డిగ్రీ కళాశాలలో బిసి స్టడీ సర్కిల్ ప్రారంభించిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు మరియు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , అడిషనల్ కలెక్టర్ మను చౌదరి .

▫️నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ:

▫️రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని బీసీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగ, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

▫️ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు

▫️స్టడీ సర్కిళ్ల ద్వారా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల వివరాలు సహా యువత చదువుకు తగ్గ ఉద్యోగ ఉపాధి సమాచారాన్ని, గైడెన్స్ ను అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ఎంపీ రాములు అన్నారు.

▫️ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కల్పన గారు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page