నా విజయం… ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క కుటుంబానికి, ఏ ఒక్క వర్గానికి పరిమితం కాదు…. ఇది కుత్బుల్లాపూర్ ప్రజల విజయం….
*సాక్షిత : *132 – కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పలు కాలనీల సంక్షేమ సంఘం నాయకులు, ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నా విజయం ఏ ఒక్క ప్రాంతానికి, ఏ ఒక్క వర్గానికి, ఏ ఒక్క కుటుంబానికి పరిమితం కాదని ఇది కుత్బుల్లాపూర్ ప్రజల విజయమన్నారు. ముచ్చటగా మూడవసారి భారీ మెజారిటీతో ఇంతటి విజయాన్ని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజలకు సదా రుణపడి ఉంటానని తెలిపారు.