మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

Spread the love

మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. సాయంత్రంతో జాతర ముగిసింది.

మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. జాతరపై టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. లక్షలాది మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చి అమ్మవార్లను దర్శించు కుని.. మొక్కులు సమర్పిం చుకున్నారని తెలిపారు.

బస్సుల్లో తిరిగి క్షేమంగా తమ సొంతూళ్లకు చేరుకు న్నారన్నారు.మేడారం జన జాతరకు వచ్చే భక్తులను సురక్షితంగా గమ్యస్థానా లకు చేరవేసిన ఆర్టీసీ కుటుంబానికి అభినంద నలు తెలిపారు.

అతి తక్కువ సమయంలోనే మెరుగైన మౌలిక సదుపా యాలు కల్పించి.. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అధికారులు చర్యలు తీసు కున్నారని ప్రశంసించారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ స్కీమ్‌ను జాతరలో సిబ్బంది విజయవంతంగా అమలు చేశారన్నారు.

ఈ జాతరలో ప్రతి ఒక్క సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వర్తించి.. ఉన్నత స్థాయి వృత్తి నైపుణ్యాన్ని కనబరి చారన్నారు.లక్షలాది మంది భక్తులను జాతరకు చేర్చే కీలకమైన, సంక్లిష్ట మైన పనిని సమష్టి కృషితో విజయవంతంగా పూర్తి చేశారన్నారు.

ప్రయాణ సమయంలో భక్తులు ఆర్టీసీ సిబ్బందికి ఎంతగానో సహకరించా రని.. పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ప్రజా రవాణా వ్యవస్థను ఆదరి స్తున్నామని, ప్రోత్సహిస్తు న్నామని మరోసారి నిరూపించారంటూ కొనియాడారు.

మేడారం మహాజాతరలో ఆర్టీసీ సేవలను వినియో గించుకుని, సిబ్బందికి సహకరించిన భక్తులందరికీ ప్రత్యేక సజ్జనార్‌ కృతజ్ఞ తలు తెలిపారు…

Related Posts

You cannot copy content of this page