బలహీన వర్గాల నాయకుడు ప్రజా పోరాట సమితి (పి ఆర్ పి ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలనీ అందుకు ప్రగతిశీల, సామాజిక, ఉద్యమ ప్రజా సంఘాల కార్యకర్తలు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు, సమన్నతంగా బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించి, పార్లమెంటుకు పంపించాలని బి.ఎల్.ఎఫ్. రాష్ట్ర చైర్మన్ నల్ల సూర్య ప్రకాష్ ఉద్ఘాటించారు. చిట్యాల మున్సిపల్ కేంద్రంలో ఆదివారం జరిగిన భువనగిరి పార్లమెంట్ బి.ఎల్.ఎఫ్. భాగస్వామ్య రాజకీయ పక్షాల ఉమ్మడి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.
నూనె వెంకట్ స్వామి ని గత 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నదని అలాంటి వ్యక్తిని గెలిపించి బి.ఎల్.ఎఫ్ సత్తాను భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో చాటి చెప్పాలన్నారు. కొన్ని వామపక్ష పార్టీలు, వామపక్ష ఐక్యతకు తిలోదకాలను ఇచ్చి, పైకి మాత్రం ఐక్యత రాగాలను ఆలపిస్తూ ఆంతరంగికంగా వామపక్ష ఐక్యతకు తూట్లు పొడిచి బి.ఎల్.ఎఫ్. నుండి బయటికి వెళ్లి ఈరోజు ఆధిపత్య కుల రాజకీయ పార్టీలను బలపరుస్తూ, అవకాశవాదంగా కుటిల రాజకీయ ఎత్తుగడలతో భువనగిరి పార్లమెంట్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వారికి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉండవని, పోరాటమే ఊపిరిగా ముందుకు సాగుతున్న నూనె వెంకట్ స్వామి ముందు వారందరూ దిగదుడుపని అటువంటి పోరాట నాయకుడిని గెలిపించేందుకు బిఎల్ఎఫ్ శ్రేణులు కంకణం కట్టుకుని ముందుకు సాగాలన్నారు.ఈ సమావేశానికి పి అర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అధ్యక్షత వహించగా
నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి వస్కుల మట్టయ్య, ఎం సి పి ఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి ఎస్కే నజీర్, ఎం సి పి ఐ నాయకులు పోతుగంటి కాశి, ప్రజా పోరాట సమితి నాయకులు కోట జైపాల్ రెడ్డి, మైనం నరేష్, బైరు వెంకన్న గౌడ్, గుణగంటి సత్తయ్య గౌడ్, తిరగమల్ల యాదయ్య, మైలారం జంగయ్య, మైలారం సుదర్శన్, వట్టిపల్లి సుదర్శన్, సీసా శ్రీనివాస్ పాల్గొన్నారు.