SAKSHITHA NEWS

చిట్యాల సాక్షిత ప్రతినిధి

చిట్యాల మున్సిపాలిటీ 10వ వార్డు భువనగిరి రోడ్డులో ఇమ్మడి వెంకన్న ఇంటి నుండి కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి (నాగార్జున గ్రామీణ వికాస్ బ్యాంక్) వరకు డ్రైనేజి నిర్మాణానికి మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి స్థానిక కౌన్సిలర్ సిలివేరు మౌనిక శేఖర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ
గత కొన్ని సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య ఉందని స్థానిక కౌన్సిలర్ సిలివేరు మౌనిక శేఖర్ తెలిపారని అన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కి సమస్య గురించి తెలపగా నిధులు మంజూరు చేశారని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్దుని అభివృద్ది చేస్తానని అన్నారు. అనంతరం స్థానిక కౌన్సిలర్ సిలివేరు మౌనిక శేఖర్ మాట్లాడుతూ గత 20సం. లుగా ఈ డ్రైనేజీ సమస్య ఉందని, గతంలో కూడా సమస్య పరిష్కారం కోసం కృషి చేశానని పలితం లేకపోవడం తో కౌన్సిలర్ గా గెలిచిన నాటి నుండి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకి, మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి దృష్టికి తీసు కెల్లానని సమస్య పరిష్కారం కోసం మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు.

వార్డు అభివృద్దే తన ధ్యేయమని వార్డులో ప్రతి సమస్యని పరిష్కరించి మున్సిపాలిటీ పరిధిలోనే 10వ వార్డుని ఉత్తమ వార్డు గా అభివృద్ది చేస్తానని అన్నారు. డ్రైనేజీ సమస్య ని పరిష్కరించిన మున్సిపల్ చైర్మన్ కి, ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య, జిట్టా పద్మా బోందయ్య, కో ఆప్షన్ సభ్యులు సల్మా శుకూర్, సింగిల్ విండో డైరెక్టర్ జగిని బిక్షం రెడ్డి, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గంట్ల శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కార్యదర్శి జిట్టా చంద్రకాంత్, రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు తెరటుపల్లి హనుమంతు, కనకదుర్గ గుడి చైర్మన్ షీలా సత్యనారాయణ, గ్రంథాలయ కమిటీ చైర్మన్ దాసరి నరసింహ, బాల నరసింహ స్వామి దేవస్థానం గుడి చైర్మన్ బొర్రారెడ్డి, నాయకులు రవి పంతులు,మందడి జనార్దన్ రెడ్డి, ఇమ్మడి వెంకన్న, చిత్రగంటి ప్రవీణ్, సంతు సింగ్, చింతపల్లి బిక్షం, ఇస్తారి,వార్డు ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 05 11 at 3.27.23 PM

SAKSHITHA NEWS