SAKSHITHA NEWS

మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి – నూనె వెంకట్ స్వామి

— గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి – పిఆర్పీఎస్

…….

చిట్యాల సాక్షిత ప్రతినిధి

గతంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకటస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూనె వెంకటస్వామి మాట్లాడుతూ
గత 9 సంవత్సరాలుగా కేసీఆర్‌ పాలనలో ప్రతి సంవత్సరం 365 రోజుల్లో గ్రామపంచాయతి కార్మికులు 60 రోజులు సమ్మె చేశారు. అంటే సుమారు 400 రోజులు సమ్మె పోరాటమే చేశారు.

గత తొమ్మిదేళ్ళుగా వరుసగా పోరాడుతున్నా కేసీఆర్‌ ప్రభుత్వం గ్రామపంచాయతి వర్కర్లను మభ్యపెట్టి సమ్మెను విరమింప చేస్తోంది. సమస్యలు పరిష్కారం కాక సమ్మె పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నెలకు 19వేల రూపాయల జీతం ఇస్తామన్న కేసీఆర్‌ హామీ అమలయ్యేంత వరకు, సమ్మె డిమాండ్లను అమలు చేసే వరకు గ్రామపంచాయతి కార్మికుల సమ్మెకు ప్రజా పోరాట సమితి మద్దతుగా పోరాటం చేస్తుందని తెలిపారు. వరికల్ గోపాల్, చిట్టిమళ్ళ శ్రవణ్ కుమార్ యోధ, ఉయ్యాల లింగ స్వామి గౌడ్, నాగిళ్ళ యాదయ్య, బెల్లపు అశోక్, రొయ్య అంజయ్య, పబ్బు చంద్రశేఖర్ గౌడ్బ తదితరులు మద్దతు తెలిపారు.


SAKSHITHA NEWS