SAKSHITHA NEWS

మంత్రి హరీష్ రావు గారి పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లను,మధ్యాహ్న భోజన కార్మికులను, దొడ్ల, గ్రామ మహిళలను,కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చెయ్యడం భదాకరం

ములుగు పోలీస్ స్టేషన్ లో కొండాయి గ్రామ ప్రజలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మంత్రి హరీష్ రావు గారి పర్యటన నేపథ్యంలో తమ వినతులు ఇవ్వడానికి వచ్చిన ఏటూరు నాగారం మండలం దోడ్ల గ్రామానికి చెందిన మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం తో విషయం తెలుసుకున్నా ఎమ్మెల్యే సీతక్క గారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి దొడ్ల గ్రామ మహిళలను మరియు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్ ను పరామర్శించి అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నా సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని తమ సమస్యల పై వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్ట్ చెయ్యడం భాద కరం అని ములుగు జిల్లా వ్యాప్తంగా గత కొంత కాలంగా అంగాన్ వాడి ఉద్యోగులు ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా లు రాస్తా రోకో లు రిలే నిరహారదీక్షలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించక పొగ వారిని అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురి చెయ్యడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదుఅని అక్రమ అరెస్ట్ లు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో సీతక్క గారి వెంట కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర, జిల్లా,మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS