జోనల్ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి

Spread the love

జోనల్ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన ఎంపీపీ జల్లిపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అశ్వారావుపేట గ్రామంలోని స్థానిక వ్యవసాయ కళాశాల నందు నిర్వహించిన అశ్వారావుపేట నియోజక వర్గ జోనల్ స్థాయి ఆటల పోటీలను ప్రారంభించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి. ఈ సందర్బంగా జోనల్ స్థాయి పిటి లు, దమ్మాపేట meo ఎంపీపీ గారికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఎంపీపీ జాతీయ పథకాన్ని ఎగరవేసి ఆటల పోటీలను ప్రారంభించారు.అనంతరం ఎంపీపీ జల్లిపల్లి.

శ్రీరామమూర్తి గారు మాట్లాడుతూఈ ఒక్క కార్యక్రమానికి మన నియోజక వర్గ శాసన సభ్యులు శ్రీ మెచ్చా.నాగేశ్వరరావు గారు రావాల్సి ఉందని కొన్ని కారణాల వలన రాలేక పోయారని చిన్నారులకు శుభాకాంక్షలు తెలియ జేయమన్నారని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే పిల్లలకు ఆటలు అనేవి చాలా మానసిక ఉల్లాసాన్ని, కలిగిస్తాయని అలాగే ఆరోగ్య పరంగా మంచి ఫలితాన్ని ఇస్తాయని అలాగే తెలంగాణ రాష్ట్రంలో బిఅర్ఎస్ ప్రభుత్వం వచ్చాక క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, పివి.సింధు కి కోటి రూపాయలు నజరానా తో పాటు భాగ్యనగరం లో ఇంటి స్థలం అందించరని,అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్ఛా.నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో మన మండలంలో నాలుగు గురుకులాలు నిర్వహిస్తున్నామని,గురుకులాల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి గాను బిఅర్ఎస్ ప్రభుత్వం 1,25,000 రూపాయలు ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అనీ,కార్పొరేట్ పాటశాలలకు ధీటుగా ప్రతి ఒక్క పాఠశాలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యను అందిస్తూ అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తుందని తెలియజేశారు.

అనంతరం రిబ్బన్ కట్ చేసి ఆటల ను ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఆయనతో పాటు దమ్మపేట meo కె.లక్ష్మీ, వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ డీన్ శ్రీనివాస రెడ్డి,zphs గర్ల్స్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకయ్య, జోనల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సృజన మరియు పిటి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page