మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.

Spread the love

మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మీ మద్దతు ఉండాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి *


సాక్షిత :*RS ఫ్యాక్టరీ‌ లో పనిచేస్తున్న స్థానికుల‌తో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

తిరుపతిని మెట్రో సిటీలతో పోటీ పడేలా అభివృద్ధికి కంకణం కట్టుకున్నాను, ఈ మేరకు ఒక్కొక్క అడుగు ముందుకేసుంటూ వెళ్తున్నాను. ముందుగా రోడ్లపై దృష్టి పెట్టాను.
కొత్తగా మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మించడంతో పాటు కొన్ని రోడ్లు విస్తరణ చేపట్టాం, అలాగే నగరం సుందరీకరణగా ఉండేలా కూడళ్లలో విగ్రహాలు ఏర్పాటుచేశాం, క్రీడాకారుల కోసం గొల్లవానిగూడెంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తున్నాం, దాదాపు 95శాతం పనుల పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

భవిష్యత్తులో తిరుపతికి ఐటీ కంపెనీలు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాను, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు నాకు ఉండాలని మనసారా అభ్యర్థిస్తున్నాను..

Related Posts

You cannot copy content of this page