దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! రానున్న లోక్ సభ ఎన్నికల్లో పాలక ఎన్ డి ఏ ను ఓడించడానికి కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించిన 26 ప్రతిపక్ష పార్టీల కూటమి బెంగుళూరు కేంద్రంగా డెవలప్ మెంట్ అలియన్స్ గా సంక్షిప్తంగా ఇండియాగా ఏర్పడింది. పోటీగా 39 పార్టీలతో ఎన్డీఏ సమావేశం పెట్టి అందులో కాంగ్రెస్ పై మోడీ విషం కక్కుతూ దేశంలో అస్తిరితకే కాంగ్రెస్ కూటమి ఏర్పరచిందని విషం చిమ్మినారు. విద్వేష రాజకీయాల విశ్వగురు నరేంద్ర మోడీ మరొకసారి తన సహజ అక్కసును ఇండియా కూటమి యెడల వెల్లడించి తన కురుచ రాజకీయ దృక్పధాన్ని వ్యక్తం చేశారు. అవినీతి కుటుంబ పాలన ప్రాంతీయ శక్తుల కలయిక కూటమి అని ఫెడరల్ స్ఫూర్తిని మరిచిపోతున్నారు. మోడీ పాలన అంటే అవినీతిపరులు ఎవరైనా తమ పార్టీలో చేరితే నిర్మావాస్య పౌడరు అని వెక్కిరిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా చిన్నాచితక కుటుంబ అవినీతి గుంపులనే పోగేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని అంటున్నారు. బిజెపి రెచ్చగొట్టిన రాజకీయాలతో మణిపూర్ లో విద్వేష మంటలు, అస్థిరత మోడీ అమిత్ షా పుణ్యమే కదా! అస్సాంలో ఈశాన్య రాష్ట్రాల్లో వారి కను సన్నల లోనే రోజు అల్లర్లు కొనసాగుతున్నాయి కదా! నిత్యం అస్థిరత అల్లర్లతో ఉన్నది బిజెపి పాలిత రాష్ట్రాలే కదా! ఇండియా కూటమిలో అందరినీ కలుపుకునే అనే పదమే నరేంద్ర మోడీకి మింగుడు పడడం లేదు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఒక్కో ప్రాంతంలో అక్కడి ప్రజల ప్రయోజనాల దృష్టితో పనిచేస్తూ ఉండవచ్చు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకు పోతేనే కదా పాలనలో రాజ్యాంగ స్ఫూర్తి ఇనుమడించేది. మోడీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రతిపక్ష కూటమిపై ఎదురుదాడితో అధిగమించలేరు. విదేశాలలో ఉన్న భారత సంతతి ముందు, అంతర్జాతీయ మీడియా ముందు దేశంలో కొనసాగుతున్న విద్వేష రాజకీయాలని ప్రస్తావించడం విదేశీ జోక్యం అవుతుందా? భారత సరిహద్దు, రక్షణప్రయోజనాలను వివిధ దేశాలకు మెతక వైఖరితో కొనసాగించే బిజెపి కాంగ్రెస్ విదేశీ శక్తుల మద్దతు కోరినట్లు ఆరోపిస్తున్నారు. 75 ఏళ్ల భారతావనిలో ప్రజాస్వామ్య పరిపుష్టిని 9 ఏళ్లుగా బిజెపి బలహీనం చేస్తూ ఇప్పుడు 25 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశామని మోడీ అనడం ఎంత పెద్ద అబద్ధం! దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో బిజెపి బలహీనమై అధికారాన్ని కోల్పోతుంటే వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు ఎన్డీఏ కే అని మోడీ అనడం వాస్తవ దూరం. భారత ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం, ఫెడరల్ స్ఫూర్తిని నింపడానికి ఇండియా కూటమిని బలోపేతం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నది డాక్టర్ చెరుకు సుధాకర్ తెలంగాణ పిసిసి ఉపాధ్యక్షులు
దేశ అస్థిరతకు మీ విద్వేష రాజకీయాలే కారణం.. మోడీజీ! డాక్టర్ చెరుకు సుధాకర్
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…