చెప్పకుండా తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీ ఖబర్దార్ TRSV-HZB

Spread the love

Modi Khabardar TRSV-HZB coming to Telangana tour without saying

మోడీ తెలంగాణకు ఏం చేసాడో? ఏం చేస్తాడో?చెప్పకుండా తెలంగాణ పర్యటనకు వస్తున్న మోడీ ఖబర్దార్ * *TRSV-HZB

మోడీ తెలంగాణ పర్యటనను వెంటనే మానుకోవాలని TRSV ఆధ్వర్యంలో ఈ రోజు జమ్మికుంట గాంధీ చౌరస్తా లో నిరసన ర్యాలీ చేసి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు ఈ కార్యక్రమానికి AISF సంఘీభావం తెలిపారు

అనంతరం TRSV నాయకులు అన్నం ప్రవీణ్, పర్లపల్లి నాగరాజు, ఆలేటి శ్రీరామ్, AISF నాయకులు మాధారపు రత్నాకర్ లు మాట్లాడుతూ..
గతంలోనే ప్రారంభమైన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభం చేయడం వెనక మోడీ గారి ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు? కేవలం TRSV పార్టీ మునుగోడు గెలుపును, ఆపరేషన్ లోటస్ లో బాగంగా మోడీ, అమిత్ షా లు TRS MLAలను కొనుగోలు చేసిన వ్యవహారాన్ని ఏమార్చి రాజకీయ లబ్ది పొందాలని తెలంగాణకు మోడీ వస్తున్నారని అన్నారు.
జిల్లాకో నవోదయ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ITIR ప్రాజెక్టు తెలంగాణ విభజన హామీలు వెంటనే నెరవేర్చి తెలంగాణ పై మోడీకి ఉన్న ప్రేమను రుజువు చేసుకోవాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో TRSV నాయకులు అన్నం ప్రవీణ్, పర్లపల్లి నాగరాజు,ఆలేటి శ్రీరామ్, ఆవుల తిరుపతి, AISF నాయకులు మాధారపు రత్నాకర్ మరియు TRSV నాయకులు సామల రాజిరెడ్డి, కొత్తగట్టు భాస్కర్, మరిగిద్దె రాజు, రాజేందర్,రమేష్, రాజు, మధు, కుమార్, శివ, ప్రశాంత్, నవీన్ మరియు సుమారు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page