కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నేతలు

Spread the love

కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ నేతలు

ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో పెట్టాలని డిమాండ్ చేస్తూ నేడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్‌ గోసాల సుధాకర్ మాదిగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగిందని

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జీ సూరిపాక వాసుదేవరావు మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టకపోతే బిజెపి రాజకీయంగా తగిన మూల్యం చెల్లించుకుంటుందని మాదిగలు నిరంతరం మోసపోయె దానికి సిద్దంగా లేరని బీజేపీ పతనం మొదలైందని వారు హెచ్చరించారు.

ఎంఎస్పీ జిల్లా కన్వీనర్‌ పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంట్లో పెట్టినప్పుడు యావత్ మాదిగ జాతి కోరుకుంటున్న ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ఎందుకు పెట్టరో సమాధానం చెప్పాలని లేదంటే ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఆకాంక్షని ఉధృతమైన నిరసనలతో మాదిగల సత్తా చాటుతామని వారు హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా కో కన్వీనర్‌ కోళ్లగట్ల రమేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్‌ సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్‌ తాటిపర్తి లక్ష్మయ్య మాదిగ, ఎంఎస్పీ మహిళా ఇన్చార్జీ గేరా జానకి మాల,ఎంఎస్పీ నాయకులు ఏ.ఏసు మాదిగ,ఎంఎంఎస్ మహిళ నాయకులు గంగపట్ల లక్ష్మమ్మ,మంద సుజాత,వి.రమణమ్మ. జి.కుమారి,వై.జయరాజు,కె.శివయ్య,ఎస్.హజరత్,డి రవి,సిహెచ్ అంకయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు,డి.భార్గవ్, బి.మనోహర్,టి.పెంచలయ్య,శ్రీ ను,కె.సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page