విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

Spread the love

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ

వీణవంక మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో లక్ష్మీ గణపతి ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… వీణవంక గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ సహకారంతో నర్సింగాపూర్ గ్రామ ఇరవై మోరిలనుండి వీణవంక పోలీస్ స్టేషన్ వరకు 29 కోట్ల 80 లక్షల నిధుల మంజూరు కావడం జరిగిందని తెలిపారు. మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు.

కరీంనగర్ జిల్లాలోనే నెంబర్ వన్ గా చేస్తానని అన్నారు.గతంలో పనిచేసిన నాయకులు వల్ల మండల కేంద్రము అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. మండల కేంద్రాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ వాలే అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే రోడ్డు విస్తరణలో ఎవరిదైనా ఇల్లు తొలగింపు జరుగుతే గ్రామ అభివృద్ధి కోసం కాబట్టి అందరూ సహకరించాలని గ్రామ ప్రజలను కోరారు. నేను చెప్పాను విలేకరులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పిన విధంగా విలేకరులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు అయ్యాయా అని తెలిపారు. తొందరలోనే ప్రోసిడింగ్ కాపీ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ఈనెల 31న హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలంలో 70 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మున్సిపల్ ఐటి శాఖ మంత్రి , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారన్నారనీ తెలిపారు. జమ్మికుంట లో భారీ బహిరంగ సభ ను విజయవంత చేయాలని కోరారు. సరదాగా మండల కేంద్రంలో టీ టైమ్స్ వద్ద చాయ్ తాగుతూ కార్యకర్తలతో గ్రామ ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జడ్పిటిసి, వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, సింగిల్ విండో డైరెక్టర్లు, సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచులు అది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page