SAKSHITHA NEWS

నాలుగేళ్లలో సంక్షేమ విప్లవం
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత బాబు , రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి
………………………… …….
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ల‌ పాలనలో రాష్ట్రంలో సంక్షేమ విప్లవం తీసుకొచ్చారని ఎమ్మెల్సీ అనంత బాబు రంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి * అన్నారు. అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామ సచివాలయం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు,ఈ సందర్భంగా 200 గడపలను సందర్శించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గడపకు తిరుగుతూ ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వ అందజేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు,అర్హత ఉండి ఇప్పటికీ సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే స్థానిక గ్రామ సచివాలయంలో సంప్రదించి సంక్షేమ పథకాలు ఎలా పొందాన్న దానిపై కూడా వివరించారు, జ‌గ‌న‌న్న ద‌య‌వ‌ల్లే గిరిజ‌నులు ఎదుర్కొంటోన్న కష్టాల‌ను తెలుసుకునే అవకాశాన్ని కలగజేశారని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తెలిపారు, ఎన్నిక‌ల్లో గెలిచిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఇలా తిరిగి స‌మ‌స్య‌లు తెలుసుకొని ప‌రిష్క‌రించ‌డం అనేది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే సాధ్య‌మైంద‌న్నారు.
పేదరికమే ప్రామాణికంగా తీసుకొని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల మంజూరు చేయడం తమ ప్రభుత్వంలోనే సాధ్యమైంద‌ని చెప్పేందుకు గర్వంగా ఉందన్నారు. మధ్యవర్తులు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులు ఖాతాలకు జమవుతుండ‌డం చారిత్రాత్మకమని తెలిపారు. గిరిజన ప్రాంతంలో తాను గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించిన గ్రామాలలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు స్ప‌ష్టం చేశారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు శాయ‌శక్తుల ప్రయత్నిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండల కన్వీనర్, ఎంపీపీ ,జడ్పిటిసి ,వైస్ ఎంపీపీలు,సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్, వివిధ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ కోఆప్షన్ నెంబర్, వైస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సచివాలయం కన్వీనర్లు గృహసారదులు, ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపిటిసిలు,ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 15 at 6.31.48 PM

SAKSHITHA NEWS