SAKSHITHA NEWS

MLA who started the placements – training program under the auspices of Color Sky Technologies.

కలర్ స్కై టెక్నాలజీస్ ఆధ్వర్యంలో ప్లేస్ మెంట్స్ – ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శ్రీ రతన్ టాటా 85వ జన్మదిన సందర్భంగా కలర్ స్కై టెక్నాలజీస్ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిర్వహించనున్న ప్లేస్ మెంట్స్ – ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ESDM) పథకం కింద విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తూ ఉద్యోగావకాశ కల్పనకు కలర్ స్కై టెక్నాలజీస్ వారు సహకారం అందించడం అభినందనీయం అన్నారు. గత 2014 నుండి నేటి వరకు అనేక మందికి శిక్షణ అందించి, వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా కలర్ స్కై టెక్నాలజీస్ వారు కృషి చేయడం సంతోషదాయకం అన్నారు.

ఈ చక్కటి అవకాశాన్ని విద్యార్థులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తన తండ్రి స్వర్గీయ కేఎం పాండు జ్ఞాపకార్థం కోటి రూపాయలతో వొకేషనల్ కాలేజీని త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనేయులు, ఎంహెచ్ఓ డాక్టర్ నిర్మల, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇష్రాత్, టాస్క్ సంస్థ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రదీప్ రెడ్డి, కలర్ స్కై టెక్నాలజీస్ సంస్థ యాజమాన్యం నేహ బండారి, అవినాష్ కుమార్, శ్యామ్, కిరణ్ మరియు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కో ఆర్డినేటర్ నారాయణ రావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS