గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సందర్బంగా తెలంగాణ తల్లికి నివాళులు అర్పించి బిఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ…
ఇరవై మూడేండ్ల కింద ఇదే రోజు పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి చిన్న చిన్న అడుగులతో ప్రారంబమై ఘనమైన విజయలతో ముందుకెళ్లిన చరిత్ర మన పార్టీ కి ఉంది
2001వ సంవత్సరంలో హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్తగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఉద్యమ పార్టిగా ఆవిర్బవించి తెలంగాణ రాష్ట్ర సాధన కళను సాకరం చేసుకొని విజయవంతంగా బంగారు తెలంగాణగా రూపామిచ్చిన పార్టీ మన పార్టీ
విజయ పరంపరలో భాగంగా తెలంగాణాలో వచ్చిన మార్పును దేశ ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మర్చి ముందుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో మన పాత్ర కీలకమైనది
తెలంగాణలో తెచ్చిన అభివృద్ధి గానియ్యండి సంక్షేమం కానీయ్యండి దేశ ప్రజలకు కొత్త ఉదాహరణగ నిలిచినా తెలంగాణ మాడల్ ను దేశానికి ఇవ్వడమే మన లక్ష్యంగా ముందుకెళ్లాలని తెలిపారు
తెలంగాణ రాష్ట్ర ప్రకజలకు ఇచ్చిన పథకాలైన రైతుబందు, రైతుబీమా, మద్దతు ధర, 24 గంటల నాణ్యమైన విద్యుత్తు, సాగు నీరు, తాగునీరు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్టు, దళితబందు, సీఎంఆర్ఎఫ్, గురుకుల పాఠశాలల లాంటి విజయ వంతమైన పథకాలతో పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో దేశంలోనే నెంబర్ 1 నిలిపిన చరిత్ర మన పార్టీకి ఉందని తెలిపారు.
బీఆరెఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను తన సొంత పిల్లల్లా చూస్తుందని ప్రతి కార్యకర్త సభ్యత్వం తీసుకున్న వారికీ రెండు లక్షల భీమను అందిస్తున్నది.
బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పార్టీని మళ్ళీ అధికారంలోకి తెస్తారు, ప్రజలు చేసిన మేలును ఎప్పుడు మర్చిపోరు 420 దొంగ హామీలకు మోసపోయిన ప్రజలు 100 రోజుల పాలనలోనే కేసీఆర్ ని కోరుకుంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ వైస్ చైర్మన్ బాబర్, ఎంపీపీలు ప్రతాప్ గౌడ్, రాజారెడ్డి, జడ్పీటీసీలు ప్రభాకర్ రెడ్డి, రాజశేఖర్, మాజీ గ్రంధాలయ చైర్మన్ జంబూ రమన్ గౌడ్, గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, కౌన్సిలర్లు నాగిరెడ్డి, దౌలు, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, నరహరి శ్రీనివాసులు, మురళి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోవిందు, ఉపాధ్యక్షులు ధర్మానాయుడు, ప్రధానకార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, మల్దకల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న, వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ సత్యరెడ్డి, విక్రమ సింహ రెడ్డి, దేవాలయ చైర్మన్ జమ్మిచేడు సతీష్, మైబూబ్, రామయ్య, రిజ్వాన్, కురుమన్న, భగీరథ వంశీ, ముబీన్, ఆలూరు రామయ్య, పెద్దపల్లి అజయ్, వంట భాస్కర్, జానకి రాముడు, గంట రమేష్, బాలాజీ, పుట్ట విజయ్, గాంధీ, శ్రీనివాస్ యాదవ్, mk ప్రవీన్, ప్రితం, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొన్నారు.