SAKSHITHA NEWS

ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..

NTR జిల్లా / నందిగామ టౌన్ :

నందిగామ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ.2.50 లక్షల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పంపిణీ చేశారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల వైద్యారోగ్యానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్తిస్తూ.. విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారని తెలిపారు. సామాన్యులకు ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీకి పునర్వవైభవం తీసుకొచ్చి సుమారు రెండువేల రకాల జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించేలా చర్యలు చేపట్టారన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించని జబ్బులకు సైతం సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటున్నారని గుర్తు చేశారు. నందిగామ నియోజకవర్గంలో ఇప్పటివరకు సీఎంఆర్ఎఫ్ ద్వారా 407 మంది లబ్ధిదారులకు రూ.2.10 కోట్ల విలువ గల చెక్కులను అందజేశామని, 79 మంది లబ్ధిదారులకు ఎల్.వో.సి ద్వారా వైద్యానికి ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 108, 104 నూతన వాహనాలను ప్రవేశపెట్టడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ..

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బండి మల్లికార్జునరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లగడ్డ సత్యనారాయణ ప్రసాద్, గుడివాడ సాంబశివరావు, నెలకుదిటి శివ నాగేశ్వరరావు, మార్త శ్రీనివాసరావు, మంగళంపూడి కోటి బాబు తదితరులు పాల్గొన్నారు ..


SAKSHITHA NEWS