సాక్షిత : బాపులపాడు మండలం వీరవల్లీ గ్రాంమలో బక్రీదు పండుగ వేళ ఈద్గ ప్రార్ధన మైదానం వద్ద నూతనంగా నిర్మించిన వంతెను ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రారంభించారు. అనంతరం మత పెద్దలు, ముస్లీం సంఘాలు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వంశీ ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులకు బక్రీదు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
రంజాన్ , బక్రీదుతో పాటు విశేష పండుగ దినాల్లో ముస్లీంలు ప్రార్ధనలు చేసుకునే ఈద్గ మైదనానికి వెళ్లాలంటే కాల్వ దాటి వెళ్లాల్సిన పరిస్ధితి. గత కొన్నేళ్లుగా కాల్వ దాటి ఈద్గకు వెళ్లాలంటే ముస్లీం సోదురుులు తీవ్ర ఇబ్బందలు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన అయన తన సొంత నిధులు సాయం చేశారు. మొత్తం 3లక్షల రూపాయలు వ్యయంతో అతి తక్కువ సమయంలోనే వంతెన నిర్మాణం పూర్తి చేశారు. ధర్మ నిబద్ధతకి ప్రతీక బక్రీద్ పండుగని దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య బక్రీద్ జరుపుకుంటారని తెలిపారు.. బక్రీద్ పండుగ వేళ ముస్లీం సోదరులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే వంతెన ప్రారంభించట నాకెంతో సంతోషంగా ఉందని ఇది నా అదృష్టంగా భావిస్తున్నాని ఎమ్మెల్యే వంశీ అనందం వ్యక్తం చేశారు . అల్లాహ్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లీం నాయకులు షేక్ కాలీషా, షేక్ అలీ, షేక్ రియాజ్ బాషా, ఇంద్రీష్, ఇమాంసా, సైదులు, షేక్ చిన్న కాలీషా పలువురు మత పెద్ద, ముస్లీం నాయుకులు వైఎస్సాఆర్ సిపి మండల అధ్యక్షుడు నక్కా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అవిర్నేని శేషగిరి , ఎంపీపీ వై నగేష్ జడ్పిటీసీ కొమరవెల్లి గంగాభావానీ, సర్పంచ్ పిల్లా అనిత రామరావు, గ్రామ వైఎస్సాఆర్ సిపి పార్టీ కన్వీనర్ గూడవల్లి రత్న సుధాకర్ , జిల్లా కార్యదర్శి కోడేబోయిన బాబీ, అత్మూరి బాలాజీ, పిఏసిసిఎస్ ఛైర్ పర్సన్ అల్లాడి థెరిస్సా, ఎంపిటిసి దూసరి నిర్మల, జిల్లా మహిళ కార్యదర్శి రాయి శివపార్వతి, మండల ఎస్సీ సెల్ నాయకులు తోమ్మండ్ర రమేష్, మోర్ల అంజనేయలు , గండిచిన్నారావు, వేము శిలువరాజు , కాటమాల పండు, చాండ్ర బుజ్జి , రాయ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
బక్రీదు పండుగ వేళ ముస్లిం పోదరులకు ఉపయోగపడే మంచి కార్యానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వంశీ
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…