సున్నిపెంట గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
ఎమ్మెల్యే శిల్పాకు ఘనంగా స్వాగతం పలికిన సున్నిపెంట గ్రామ ప్రజలు మహిళలు..!
మూడురోజుల పాటు సున్నిపెంట గ్రామంలో గడపగడప తిరగనున్న ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
రెండవ రోజు వెస్ట్రన్ కాలని పాత సున్నిపెంట రిక్షా కాలనీ ప్రతి గడపకు తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే శిల్పా..!
ప్రజలు ఏమైన సమస్యలు ఉన్నాయా అడిగి అక్కడే ఉన్న అధికారులతో పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే శిల్పా….!
శ్రీశైలం మండలం సాక్షీత ఏప్రిల్:24: సుండిపెంట గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు కార్యక్రమం ఆదివారం ప్రారంభించారు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఆదివారం నుండి సుండిపెంటలో 83 వ రోజు చేరుకుంది గత 82 రోజులుగా నియోజకవర్గమంతా తిరుగుతూ ఆదివారం ఉదయం గడపగడపకు కార్యక్రమం కోసం సున్నిపెంట గ్రామానికి రావడంతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి స్థానిక ప్రజలు నాయకులు,పెద్ద ఎత్తిన మహిళలు ఘనంగా స్వాగతం పలికారు అయితే మూడురోజుల పాటు సుండిపెంట గ్రామంలో ఎమ్మెల్యే శిల్పా గడపగడప తిరగనున్న నేపద్యంలో సోమవారం రెండవ రోజు పాత సున్నిపెంట వెస్ట్రన్ కాలనీ రిక్షా కాలనిలో ప్రతి గడపకు తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అని ప్రజలను అడిగి మరి తెలుసుకున్నారు అలానే ప్రజలు చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశించారు ప్రజలు అన్ని పథకాలు అందజేయడం అలానే ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సంతోషంగా ఉండేట్లు చూడ్డమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు మళ్ళీ తిరిగి లింగాలగట్టు గ్రామంలో మంగళవారం ఉదయం 8 గంటల నుండి మూడవ వరోజు గడపగడపకు కార్యక్రమం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు, పొదుపు మహిళలు, అంగన్వాడి సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు