విశ్వ జనని విద్యారత్న అవార్డు అందుకున్న విద్యావేత్త గొట్టిముక్కుల నాసరయ్య

Spread the love

విశ్వ జనని విద్యారత్న అవార్డు అందుకున్న విద్యావేత్త గొట్టిముక్కుల నాసరయ్య

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక సాహితీవేత్త, తెలుగు అధ్యాపకులు గొట్టిముక్కుల నాసరయ్యకు సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఏ1 కన్వెన్షన్ హల్ లో విశ్వ జనని పౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మరియు చైర్మన్ బొగ్గరపు బ్రహ్మానందం ఆధ్వర్యంలో విశ్వ జనని పౌండేషన్ ప్రధమ వార్షికోత్సవం సందర్భంగా టీవీ మరియు సినీ అవార్డులను వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన వ్యక్తులకు ప్రధానం చేశారు, సాహిత్య, విద్య రంగంలో విశేష కృషికి గాను గొట్టిముక్కల నాసరయ్యకు విశ్వ జనని విద్యారత్న అవార్డును అందజేశామని చైర్మన్ బొగ్గరపు బ్రహ్మానందం మరియు సినీ ఆర్టిస్ట్ లు శ్రీ రాజేంద్ర, బాలాజీ, శ్రీమతి పూర్ణిమ, రాగిణి, జబర్దస్త్ అప్పారావు, గీతాసింగ్, రేణుక ప్రముఖులు చేతుల మీదగా అందుకున్నారు, ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ ఈ అవార్డు అనందం హర్షం చేస్తూ, అవార్డుకు ఎంపిక చేసిన బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు తెలిపారు, అనంతరం నాసరయ్యను తమ గురువులు, బంధు మిత్రులు, తెలుగు ఉభయ రాష్ట్రాల కవులు, కళాకారులు అభినందించారు.

Related Posts

You cannot copy content of this page