SAKSHITHA NEWS

ప్రెస్ మీట్

తేది: 25-07-2023

ఎమ్మెల్యే సీట్లకై ఆగస్టు 13 న యాదవ యుద్ధభేరి

రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 లోకసభ, రాజ్యసభ సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 13 న హైదరాబాద్ లోని సరూర్ నగర్ గ్రౌండ్ లో నిర్వహించే యాదవ యుద్ధభేరిని జయప్రదం చేయాలని యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ అన్నారు.

నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యుద్ధభేరి పోస్టర్ ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాలకవర్గ పార్టీలు గొర్రెలు, బర్రెలు, ఆవుల పేర్లు చెప్పి యాదవులను జీవాల కాపర్లుగా పరిమితం చేసి, కుల వృత్తుల చట్రంలో ఇరికించజూస్తున్నారన్నారు. రేపటి యాదవ తరాలను చదువులకు దూరం చేసే కుట్ర తెలంగాణాలో జరుగుతుందన్నారు. కుల వృత్తులకు పరిమితమైతే చదువులు, ఉద్యోగాలు, అధికారానికి దూరం కావాల్సి వస్తుందని ఆయన అన్నారు. అందుకే సీట్ల వాటా, ఆర్ధిక వాటా, రాజ్యాధికారమే అంతిమబాటగా నినదించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అందుకే యాదవులు గొర్రెల కోసం కాకుండా సీట్ల కోసం గొంతెత్తాలని, ఏ రాజకీయ పార్టీ మాయమాటలకు లోనవకుండా జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు. కాబట్టి రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఎన్నికల ఎత్తులకు జిత్తులకు లోనవకుండా, ఒక్కపార్టీకి ఫాలోవర్లుగా మిగిలిపోకుండా యాదవులు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలని, యాదవుల జనాభాకు తగిన సీట్లు ఇవ్వని పార్టీలకు ఓట్లేయబోమని తిరగబడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలలో యాదవులు ఓట్లేయడమే కాదు, పోటీ చేయడంలో కూడా కీలకంగా ఉండాలన్నారు. అందుకోసం పోటీ చేయాలనుకునే వారు ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఆయా పార్టీలను సీట్లు అడగాలని, జెండాలు మోసే బానిసలుగా ఇక మీదట ఉండొద్దని ఆయన హితవు పలికారు. ఎన్నికల వేళ బిసి రాగం వలకబోస్తున్న పాలక పార్టీలు జనాభా ప్రాతిపదికన యాదవులకు, ఆయా కులాలకు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.

యాదవులు, యాదవ ఉపకులాల జనాభ తెలంగాణలో 18 శాతం జనాభా ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ జనాభా దామాషా పద్దతిలో ప్రాతినిధ్యం ఇవ్వకుండా అన్ని రంగాల్లో యాదవులను అగ్రకుల పాలకులు వెనుకబడేశారన్నారు. అందుకే యాదవుల అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర బడ్జెట్లో 18% నిధులు కేటాయించాలన్నారు. అలాగే జన గణనలో కుల గణన వెంటనే చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కుల గణన చేపట్టాలన్నారు. యాదవులకు నష్టం కలిగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని, యాదవులు, యాదవ ఉపకులాలకు ఎస్.ఎన్.టి రిజర్వేషన్లు కల్పించాలని, యాదవుల విద్యా, ఉద్యోగ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, యాదవ స్టూడెంట్స్ కు ల్యాప్ టాప్స్, టాబ్స్, కంప్యూటర్స్, ఓవర్సీస్ ఫండ్ అందజేయాలని ఆయన ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో వట్టె జానయ్య యాదవ్ చైర్మన్, డిసిఎంఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా
నల్లగొర్ల మురళి యాదవ్ చైర్మన్, నర్సాపూర్ మున్సిపాలిటీ
పోచబోయిన శ్రీహరి యాదవ్, గొర్ల కాపరుల సంక్షేమ సంఘం
కరాటే కళ్యాణి యాదవ్ యాదవ కల్చరల్ సెంటర్
సాధం బాలరాజు యాదవ్, తెలంగాణ యాదవ సంక్షేమ సమితి
మేక లలిత యాదవ్, ఉద్య
నల్లగొర్ల అచ్యుత యాదవ్
నోముల సైదులు యాదవ్
డాక్టర్ దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్
ఆర్.ఎన్. గౌతమ్ యాదవ్, యాదవ వాహిని చక్రధర్ యాదవ్,
బైకాని బిక్షపతి యాదవ్, అఖిల భారతీయ యాదవ మహాసభ
బేరి రామచంద్ర యాదవ్, యాదవ సంక్షేమ సంఘం
రాగం సతీష్ యాదవ్, యాదవ జాగృతి
గంగుల మధు యాదవ్, యాదవ యువజన విభాగం
నోముల శేషు యాదవ్
శెట్టి హరికృష్ణ యాదవ్, యాదవ జర్నలిస్టు సంఘం
కె. శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు

చలకాని వెంకట్ యాదవ్
రాష్ట్ర అధ్యక్షులు
యాదవ విద్యావంతుల వేదిక
తెలంగాణ రాష్ట్రం
9866589914


SAKSHITHA NEWS