అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది ఎమ్మెల్యే ఆర్కే

Spread the love

ఆరోపించిన వారికి నిరూపించే దమ్ముందా అంటూ ఆర్కే ప్రశ్న!

మంగళగిరి నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ సత్య దూర ఆరోపణలకు తెరతీసిందని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు…

ఉండవల్లిలో గ్రావెల్ అక్రమాలు జరుగుతున్నాయన్న డ్రామాకు తెరతిసిన తదేపా… దమ్ముంటే నిరూపించాలని కొరారు.

అనేక గ్రామాల్లో రైతులు వృద్ధులు మరియు మహిళలు సరైన రోడ్ల సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వారి ఇబ్బందిని గ్రహించి గ్రామాల్లో గ్రావెల్ రోడ్లు, రైతుల కోసం డొంక రోడ్లను నిర్మిస్తుంటే చూసి ఓర్వలేని తెలుగుదేశం పార్టీ శ్రేణులు నారా లోకేష్ ఆదేశానుసారం అభివృద్ధిని అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు.

ఆరోపణలు చేస్తున్న వారి మనస్సాక్షికి తెలుసు గతంలోకి ఇప్పటికి ఈ నియోజకవర్గ పరిస్థితి.

2019 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు సుమారు 400 – 500 కోట్ల రూపాయల నిధులతో అభివృధి పనులు జరిగాయి….

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మూడు శాఖల మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్ ఏనాడు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన దాఖలాలు లేవని…

ముప్పై సంవత్సరాల నుండి ఆయా గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తుంటే…

వక్ర బుద్ధితొ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు నివసిస్తున్న ప్రాంతంలో నివాస స్థలాలు 2007లో అధికారుల తప్పిదం వలన వక్ఫ్ బోర్డ్ భూములుగా 22A నిషేధిత జాబితాలో ఉండగా ప్రజల ఇబ్బందులు తెలిసి నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఆ ప్రాంతాన్ని 22A నిషేధిత జాబితా నుండి తొలగించడంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారన్న విషయం పోతినేనికి తెలీదా అని ప్రశ్నించారు.

Related Posts

You cannot copy content of this page