కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.84 కోట్లతో.. జిహెచ్ఎంసి పరిధిలో రూ.95 కోట్లతో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా శాఖల అధికారులు, ఏజెన్సీ, కార్పొరేటర్లతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏయే ప్రాంతాల్లో పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఎమ్మెల్యే అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాదాపు 85% పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యే కి వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్ల నిధులతో చేపడుతున్న ఆయా పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా వర్షాకాలం వరకు పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ ఆనంద్, ఈఈలు నారాయణ, కృష్ణ చైతన్య, డిఈఈలు నరేందర్, నళిని, ఏఈలు రామారావు, నాగరాజు, లక్ష్మీ నారాయణ, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కార్పొరేటర్లు రవికిరణ్, సురేష్ రెడ్డి, ఆగం రాజు, ఆగం పాండు ముదిరాజ్, కాసాని సుధాకర్, జ్యోతి, సీనియర్ నాయకులు కొలన్ గోపాల్ రెడ్డి, కొలన్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
రూ.149 కోట్లతో చేపడుతున్న ఎస్.ఎన్.డి.పి పనుల పురోగతిపై ఎమ్మెల్యే సమీక్ష…
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…