ములకలపల్లి
మండలంలో పర్యటించిన MLA మెచ్చా నాగేశ్వరరావు
అధైర్య పడొద్దు అండగా ఉన్నాం ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం – MLA మెచ్చా
4.5కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించాను..
ములకలపల్లి – పాల్వంచ BT రోడ్డునీ పరిశీలించిన MLA మెచ్చా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన MLA మెచ్చా
అశ్వారావుపేట(నియోజకవర్గం), ములకలపల్లి(మండలం) చాపరాలపల్లిలో కులి పనులు ముగించుకుని తమ ఇంటికి వెళ్తుండగా కుమ్మరివాగు దాటే క్రమంలో ఇద్దరు మహిళలు కొట్టుకు పోయారు.స్థానికంగా ఉన్న యువకులు ఒక మహిళను కపాడగ మరో మహిళ కుంజ సీతమ్మ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు గ్రామానికి వెళ్లి వాగును పరిశీలించారు. ఇంటి వద్ద ఉన్న మహిళ వైద్య ఖర్చుల నిమిత్తం 15,000/- రూ ఆర్థిక సహాయంతో పాటు వారికి ప్రభుత్వం తరుపున ఇల్లు.
అలాగే ప్రవాహంలో కొట్టుకుపోయిన కారణంగా ప్రభుత్వం తరుపున ఆదుకునే ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు అలాగే 4.5 కోట్లతో బ్రిడ్జి మంజూరు చేయించామని.త్వరలో పనులు ప్రారంభిస్తామని.వచ్చే వానా కాలంలోపు బ్రిడ్జి ఉంటుందని గ్రామస్థులకు MLA గారు తెలిపారు.అనంతరం ములకలపల్లి – పాల్వంచ వెళ్ళే మార్గంలో సీతారాంపురం వద్ద ముర్రేడు వాగు ప్రవాహానికి రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగ ఉండటంతో అధికారులతో కలిసి రోడ్డునీ ఎమ్మెల్యే గారు పరిశీలించారు.వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అలాగే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతానని ఎమ్మెల్యే గారు తెలిపారు.అనంతరం ముత్యలంపాడు బ్రిడ్జిని పరిశీలించారు ..త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,నాయకులు,అధికారులు,పాల్గొన్నారు.