Dr.BR అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

Spread the love

దమ్మపేట

Dr.BR అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన MLA మెచ్చా నాగేశ్వరరావు

అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మొద్దులగూడెం(గ్రామం)లో ఏర్పాటు చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అశ్వారావుపేట MLA మెచ్చా నాగేశ్వరరావు గారు ఆవిష్కరించారు. స్థానిక మహిళలు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని.హైదరాబాద్ నడబొడ్డున కోట్ల రూపాయలతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని.అలాగే రాష్ట్ర సచివాలయానికి డా.బి.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల BRS పార్టీ అధ్యక్షులు దొడ్డకుల రాజేశ్వరరావు,దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్, అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు, కొయ్యల అచ్యుత్ రావు,సర్పంచ్ సున్నం రాము, దమ్మపేట ఉప సర్పంచ్ దారా యుగంధర్, దమ్మపేట మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్,వెంపటి భారత్,రావూరి వీరయ్య,అబ్దుల్ జిన్నా,బాల శ్రీను,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page