SAKSHITHA NEWS

ప్రగతి యాత్ర‘లో భాగంగా 40వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
జీడిమెట్ల డివిజన్ హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ, ఎరోనాటికల్ ఎంక్లేవ్ కాలనీల్లో పాదయాత్ర…
వంద శాతం అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు ఘన సన్మానం…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 40వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ మరియు ఎరోనాటికల్ ఎంక్లేవ్ కాలనీలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, మిగిలి ఉన్న పనులను తెలుసుకున్నారు. హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీలో రూ.1.56 కోట్లతో 100% రోడ్లు, మంచినీటి పైపు లైన్లు, భూగర్భ డ్రైనేజీ, 5 ట్రాన్స్ఫార్మర్ లు మరియు సీసీ కెమెరాలు, ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం అందించినందుకు కాలనీ వాసులు మంగళ వాయిద్యాలతో.. మేళతాళాలతో ఘన స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా యూఎల్ సీ సమస్యకు పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే ని కోరగా అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిటీ హాల్ పై అంతస్తుకు రూ.15 లక్షలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏరోనాటికల్ ఎంక్లేవ్ లో రూ.75 లక్షలతో సీసీ రోడ్లు, రూ.11 లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినందుకు కాలనీ వాసులు హారతులతో ఎమ్మెల్యే కి స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీ పూర్తి చేయాలని కోరగా అక్కడే ఉన్న అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ కుంట సిద్ధిరాములు, జనరల్ సెక్రెటరీ నాగేష్ రెడ్డి, ట్రెజరర్ రాజు, హానరబుల్ ప్రెసిడెంట్ మల్లేశం, అడ్వైజర్ బాలకృష్ణారెడ్డి, జాన్, శంకరయ్య, వైస్ ప్రెసిడెంట్ జీవన్ దాస్, ప్రవీణ్, రాములు, జాయింట్ సెక్రటరీలు రాజేశ్వర్, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలయ్య, ముఖేష్ చౌదరి, రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అశోక్ సింగ్, బాలరాజ్, వెంకటరమణ, బాలేష్, రాజు, రాజశేఖర్ రెడ్డి, శివ శంకర్, శంషుద్దీన్, శ్రీనివాస్, అశోక్ మరియు ఎరోనాటికల్ ఎంక్లేవ్ ప్రెసిడెంట్ కనకయ్య, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రావు, ముకుంద రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్ రెడ్డి, అమర్ నాథ్, యాదగిరి, సోమిరెడ్డి, సత్యనారాయణ, ఎల్లారెడ్డి, భగవాన్ దాస్, వెంకటేశ్వర్లు మరియు డిఈఈ భాను చందర్, ఏఈ సురేందర్ నాయక్, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, గుమ్మడి మధు సుధన్ రాజు, జ్ఞానేశ్వర్, నరేందర్ రెడ్డి, కొంటు ముకుందం, కాలే నాగేష్, నదీమ్ రాయ్, కాలే గణేష్, శ్రీకాంత్, శంకర్, విజయ్ హరీష్, పద్మ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS