SAKSHITHA NEWS

126- జగద్గిరిగుట్ట డివిజన్లో కార్పొరేటర్ కే. జగన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద విజయాన్ని ఆకాంక్షిస్తూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టైల్స్ కార్మికుల సంఘం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కార్మికుల శ్రేయస్సు కోరుకుంటూ వారి అభ్యున్నతిని కోరుకునే ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీయేనని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడవసారి ఏర్పడనున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి మరిన్ని సంస్కరణాలు చేపడుతామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కార్మిక సంఘం అధ్యక్షులు పి.రవి, ప్రధాన కార్యదర్శి జి. యాదయ్య, ఉపాధ్యక్షులు జి. వెంకన్న, కోశాధికారి ఏ. బాలరాజు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 06 At 3.50.38 Pm

SAKSHITHA NEWS